దాసరి కుమారులపై పోలీస్ కేసు.. ?

తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజులా వర్థిల్లి కాలం చేసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు కుమారులపై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు గురించి తెలిస్తే మరీ ఇంత ఘోరమా అని అందరు అంటారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే… తన వద్ద చేసిన అప్పును తీర్చమన్నందుకు దాసరి నారాయణ రావు కుమారులు చంపుతామని బెదిరించారంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు.

గుంటూరు జిల్లాకు చెందిన సోమశేఖర్ రావు అనే వ్యక్తి దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితి బాగా లేనపుడు విడతల వారీగా దాదాపు 2.10 కోట్ల రూపాయలను అప్పుగా ఇచ్చాడట. కానీ ఆ తర్వాత హఠాత్తుగా దాసరి నారాయణ రావు కాలం చేయడంతో పరిస్థితులు తారుమారయ్యాయని ఆయన వాపోయాడు. నారాయణ రావు కుమారులను పిలిచి డబ్బులు అడగ్గా వారు తమ వద్ద లేవనడంతో పెద్దల సమక్షంలో 2.10 కోట్ల రూపాయలకు బదులు 1.15 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు దాసరి ప్రభు, అరుణ్ 2018లోనే ఒప్పుకున్నారని ఆయన తెలిపాడు. కానీ ఇప్పుడు పైసలు ఇవ్వమని అడిగితే చంపుతామంటూ బెదిరిస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Share post:

Popular