డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు కోర్టు ఊరిట‌..ఫుల్ ఖుషీలో చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌!

ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రైన శంక‌ర్‌.. ఇటీవ‌ల మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్ర‌క‌టించ‌గానే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంక‌ర్‌పై కోర్టులో కేసు వేసింది. ఇండియా 2 ను పక్కన పెట్టి శంకర్‌‌ చరణ్‌ మూవీ ప్లాన్ చేయ‌డంతో లైకా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదం గ‌త కొద్ది రోజులుగా న‌డుస్తూనే ఉంది.

అయితే తాజాగా ఈ న్యాయవివాదం ఓ కొలిక్కి వచ్చింది. శంకర్‌పై నిషేధం విధించాలన్న లైకా ప్రొడక్షన్స్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ శుక్రవారం కోర్టు శంక‌ర్‌కు భారీ ఊర‌ట‌నిచ్చింది. ఇక‌ కోర్టు తీర్పుతో శంకర్‌ కొత్త సినిమాల‌కు లైన్‌ క్లియరైంది. అందుకే రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Share post:

Latest