తెరపైకి బిచ్చగాడు 2.. చిత్ర పోస్టర్ విడుదల…!

అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం ఓ కోటీశ్వరుడైన కొడుకు ఆస్తులు, అంతస్తులు వదిలి ‘బిక్షగాడి’ అవతారం ఎత్తి తల్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమా స్టోరీ. ఈ ఫిల్మ్ లో విజయ్ ఆంటోని తన యాక్టింగ్ తో అదరకొట్టాడు. తాజాగా భిక్షగాడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని డైరెక్టర్ అవతారం ఎత్తనున్నాడు. విజయ్ ఆంటోని ఓ మల్టి టాలెంటెడ్ ఆర్టిస్ట్.

అతను గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. ఇప్పుడు అతను తన దర్శకత్వ నైపుణ్యాలను కూడా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి సంబందించిన ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తాజాగా ప్రకటించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్‌లో కాళీమాత ఉంగ్రరూపంలో ఉంది. ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. తన కెరీర్‌లో ఇది చాలా ప్రత్యేకమైన చిత్రంగా విజయ్ ఆంథోనీ ప్రకటించారు.

Share post:

Latest