సూప‌ర్ కాంబో..నంద‌మూరి నటసింహంతో త్రివిక్ర‌మ్ మూవీ?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖండ త‌ర్వాత‌ గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న బాల‌య్య‌.. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేయ‌బోతున్నాడు. అయితే మాట‌ల మాత్రింకుడు త్రివిక్ర‌మ్‌తో కూడా బాల‌య్య ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ని తాజాగా ఓ వార్త వైర‌ల్ అవుతోంది.

ఇందుకు కార‌ణం లేక‌పోలేద.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల‌య్య.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ బ్యానర్ లో ఇప్పటివరకు త్రివిక్రమ్ ఎక్కువ సినిమాలు చేశారు. దాంతో బాల‌య్య‌, త్రివిక్ర‌మ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని వార్త‌లు ఊపందుకున్నాయి. మ‌రి దీనిపై అదికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

కాగా, అల‌..వైకుంఠ‌పుర‌ములో వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌.. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌, రానా హీరోలుగా తెర‌కెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు స్క్రీన్ ప్లే మ‌రియు డైలాగ్స్ అందిస్తున్నారు. అలాగే త‌న త‌దుప‌రి చిత్రాన్ని మ‌హేష్ బాబుతో ప్ర‌క‌టించారు. ఈ సినిమా ప‌ట్టాలెక్కేందుకు చాలా స‌మ‌యం ప‌ట్ట‌నుంది.

Share post:

Latest