టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైన బ‌న్నీ కూతురు..నిర్మాతగా దిల్‌రాజు?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న చిట్టి పొట్టి మాట‌లు, క్యూట్ అందాల‌తో చిన్న వ‌య‌సులోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది అర్హ‌.

అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అల్లు వారి అమ్మాయి త్వ‌ర‌లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్ర‌కారం.. అర్హ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ట‌.

అంతేకాదు, బ‌డా ప్రొడ్యూస‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని, సురేష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రం ద్వారా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Latest