రంభలా ఆ పాత్రల్లో నటించాలి: ఐశ్వర్య రాజేష్‌

సీనియర్ నటి రంభలా గ్లామరస్‌ పాత్రలో నటించాలని చిన్నతనంలో ఆశపడేదాన్ని అని నటి ఐశ్వర్య రాజేష్‌ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్‌ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని..అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్‌ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ అమ్మడు తిట్టం ఇరండు (ప్లాన్‌ బి)లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలో నటించింది. ఇందులో హీరోగా యువ నటుడు సుభాష్‌ యాక్ట్ చేశారు. కాగా క్రైమ్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య పోలీసు అధికారిగా నటించారు.

ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్‌ శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్‌ మాట్లాడుతూ.. నేను తెలుగింటి ఆడపడుచునని..చిన్నతనంలో సినిమాలు చూస్తునప్పుడు రంభలా గ్లామరస్‌ పాత్రల్లో నటించాలని ఉండేదని.. ఇప్పుడు కూడా గ్లామర్ పాత్రల్లో నటించేందుకు రెడీ అని తన మనసులోని మాటను చెప్పేసింది. ఇదిలా ఉండగా ఐశ్వర్య రాజేష్ అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.

Share post:

Latest