బరువు తగ్గేందుకు ఎన్టీఆర్‌ హీరోయిన్ ఏం చేస్తుదంటే..?

సన్నగా నాజూగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఫిట్ గా ఉండడానికి చేయాల్సిన పనులు మాత్రం ఎవ్వరూ చెయ్యరు. పైగా లావయ్యానే అంటూ ఫీల్ అవుతుంటారు. మహిళలు, పురుషులు అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. కానీ తల్లి అయ్యాక మహిళలకు ఈ సమస్య అధికం అవుతుంది. చిన్నారులకు పాలిచ్చే క్రమంలో ఎక్కువ ఆహారం తీసుకోవడం, హార్మోన్లలో తేడాలు వెరసి అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యతో సాధారణ మహిళలకే కాదు సెలబ్రిటీలు కూడా బాధపడుతుంటారు. ఒకప్పటి మన తెలుగు హీరోయిన్ లు కూడా పెళ్లయ్యాక ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. రోజా, రాధిక, రాధ, మీనా లాంటి వాళ్ళు పెళ్లయ్యాక లావైపోయారు. ఈ లిస్ట్ లో మన ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి కూడా వచ్చి చేరింది. అయితే ఆమె అందరిలా డీలా పడకుండా ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది.

బరువు తగ్గడానికి చేస్తున్న వర్క్ అవుట్ లను వీడియో తీస్తూ ‘ఫిట్‌నెస్‌’ గోల్‌ పేరుతో పోస్ట్‌ చేస్తున్నారీ సూపర్‌ మామ్‌. బరువు తగ్గే క్రమంలో యోగా చేయడం, సరైన డైట్ మెయింటెన్‌ చేయడం వంటివి తనకు ఉపయోగపడ్డాయని సమీరా తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా ‘ఫిట్‌నెస్‌ ఫ్రైడే’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ఇందులో భాగంగా సమీరా తన ఇద్దరు పిల్లలతో కలిసి వర్కవుట్స్‌ చేస్తోన్న వీడియోను షేర్‌ చేశారు. ఇక ఫిట్‌గా మారడానికి తాను చేస్తున్న వర్కవుట్స్‌ను వివరిస్తూ.. స్కిప్పింగ్‌, రన్నింగ్‌ ప్రారంభించానని తెలిపారు. వచ్చే దీపావళిలోగా తన శరీర బరువును మరింత తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకునట్టు సమీరా చెప్పుకొచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

Share post:

Popular