మాజీ భార్యతో ఓ ఆట ఆడుకున్న అమీర్ ఖాన్..ఫొటోలు వైర‌ల్‌!

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌.. ఇటీవ‌ల భార్య కిరణ్ రావ్ నుంచి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అమీర్ ఖాన్-కిరణ్‌ రావ్ ప్రకటించ‌డంతో అంద‌రూ ఒక్క‌సారిగా షాక్ గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు సెటైర్లు, ట్రోలింగ్లు కూడా చేశారు.

Aamir Khan And Kiran Rao Have A Gala Time Shooting For Laal Singh Chaddha  In Ladakh; Participate In The Table Tennis Tournament- Pictures Inside

విచిత్రం ఏంటంటే.. విడాకుల తర్వాత ఈ జంట ఇంకా కలిసే తిరుగుతున్నారు. మొన్నీ మ‌ధ్య కిర‌ణ్ రావ్‌తో.. అమీర్ తాను ప్రస్తుతం నటిస్తున్న లాల్ సింగ్ చద్దా షూటింగ్ సెట్‌లో సంద‌డి చేసి వార్త‌లు నిలిచాడు. అయితే తాజాగా మాజీ భార్య‌ను మ‌రోసారి క‌లిశాడు అమీర్‌. అంతేకాదు, ఈమెతో ఓ ఆడ ఆడ‌కున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే..

Aamir Khan-Kiran Rao reunited after divorce, played table tennis on the  sets of Lal Singh Chaddha » Ms Online

అమీర్ ప్ర‌స్తుతం అద్వైత్‌ చందన్ దర్శకత్వంలో లాల్‌ సింగ్ చద్దా అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో కరీనా కపూర్‌ హీరోయిన్‌గా, నాగ చైత‌న్య కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవల లడఖ్‌లో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్‌లో నాగచైతన్య పాల్గొన్నారు. అయితే షూటింగ్ గ్యాప్‌లో.. అమీర్ ఖాన్.. తన కొడుకు ఆజాద్, మాజీ భార్య కిరణ్ రావు, నాగ‌చైత‌న్య‌ల‌తో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Aamir Khan and Kiran Rao have a lot of fun on the sets of Laal Singh  Chaddha in Ladakh as they play table tennis, photos Inside - Box Office  Worldwide

 ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్‌తో పాటు లాల్‌సింగ్ టీమ్ సభ్యులతో ఫ్రెండ్లీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ఆడారు నాగ చైతన్య. దానికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. (Twitter/Photo)

Aamir Khan, Kiran Rao, Son Azad, Naga Chaitanya Indulge in Table Tennis  Match With Laal Singh Chaddha Team (View Viral Pics)