విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో రేర్ రికార్డ్‌..సౌత్‌లోనే ఏకైక హీరోగా..!?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్.. ఆ త‌ర్వాత సినిమా సినిమాకు అంచలంచెలుగా ఎదుగుతూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ రౌడీ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్నారు.

షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవ‌ర‌కొండ తాజాగా ఓ రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్‌లో విజ‌య్ చోటు సంపాదించాడు.

దీంతో బాలీవుడ్ సినీ ప్రముఖుల ఫొటోలతో ప్రచురితమయ్యే డబ్బూ రత్నాని 2021 క్యాలెండర్ లో విజయ్ కూడా మెరవబోతున్నాడు. సౌత్ ఇండియా నుంచి ఈ క్యాలెండర్‌లో చోటు దక్కించుకున్న ఏకైక‌ హీరోగా నిలిచి అరుదైన ఘ‌న‌ట సాధించాడు విజయ్. ఇక క్యాలెండర్‌ షూట్‌లో భాగంగా కండలు తిరిగిన దేహంతో బైక్‌పై కూర్చొని మాస్‌ లుక్‌లో విజయ్‌ ఫొటోలకు పోజులిచ్చాడు. ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

Image

Share post:

Latest