చిరు `లూసీఫర్`లో మెగా ప్రిన్స్ కీల‌క పాత్ర‌?!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ యంగ్ పొలిటీషియన్ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర‌లో ఈ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి రూమ‌ర్లే అని తేలిపోయాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆ కీల‌క పాత్ర‌లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించ‌బోతున్నాడ‌ట‌.

Varun Tej tests negative for Covid19: Thank you very much for all the love  and prayers. | Regional-cinema News – India TV

వ‌రుణ్ తేజ్ అయితే ఆ పాత్ర‌కు బాగా సెట్ అవుతాడ‌ని భావించిన మేక‌ర్స్‌.. ఆయ‌న‌నే ఎంపిక చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఆ ఆఫ‌ర్‌కు వ‌రుణ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు టాక్. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

Share post:

Latest