దిల్ రాజు కీల‌క నిర్ణ‌యం..మ‌ళ్లీ రిలీజ్‌కు సిద్ధ‌మైన `వ‌కీల్ సాబ్`?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వ‌కీల్ సాబ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్‌లో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు వకీల్ సాబ్ కి ఫిదా అయిపోయారు. అయితే థియేటర్స్ లో ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లను కొల్లగొడుతూ ఉండగానే.. కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డింది. దాంతో థియేటర్స్ దగ్గర జనం పలచబడటం .. ఆ వెంట‌నే థియేటర్లు మూతబడటం జరిగిపోయింది.

ఈ క్ర‌మంలోనే పెద్ద గ్యాప్ లేకుండా వకీల్ సాబ్‌ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయ‌గా.. అక్క‌డా హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతోంది. కేసులు త‌గ్గుతున్నాయి. ఇక త్వరలో థియేటర్లు కూడా తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే 300 థియేటర్లలో వకీల్ సాబ్ ను మళ్లీ రిలీజ్ చేయాల‌ని దిల్ రాజు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఇదే జ‌రిగితే.. మ‌ళ్లీ థియేటర్లలో దిగ‌నుంది వ‌కీల్ సాబ్‌.

Share post:

Latest