అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కీ రోల్‌?!

అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉండ‌గా.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని అఖిల్ సురేందర్‌ రెడ్డితో ప్ర‌క‌టించారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

- Advertisement -

Here's a look at films directed by Kannada film star Upendra | The Times of  India

ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ప్రారంభ‌మైన ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ కీ రోల్ పోషించ‌బోతున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. ఉపేంద్ర కూడా అఖిల్ సినిమాలో న‌టించేందుకు ఓకే చెప్పాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇది విలన్ పాత్రనా? లేదా? అనే విషయం తేలాల్సి ఉంది.

Share post:

Popular