సోనూపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత..!

June 1, 2021 at 4:12 pm

ప్రస్తుతం ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు చేస్తూ ప్రజల నుండి మన్ననలు పొందుతున్నారు. గతంలో కూడా అడిగిన వారికీ లేదనకుండా అనేక సేవ కార్యక్రమాలు చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. కాగా ఇటీవల ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సోనూసూద్ గురించి మాట్లాడుతూ, ఆయన ఒకప్పుడు కమర్షియల్ గా ఉండేవాడని అన్నారు.

సోనూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రభుత్వాల కంటే ఎన్నో రెట్లు బెటర్ గా ఆయన ప్రజలకు సహాయం చేస్తున్నాడు అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన చెప్పుకొచ్చారు.ఒక్కసారి నేను ఓ ఫంక్షన్ కి రమ్మని హీరో సోనూసూద్ ని అడిగితే దానికి ఆయన డబ్బులు అడిగాడు. అప్పుడు నేను తాను మంచివాడు కాదు చాలా కమర్షియల్ అని అనుకున్నాను. కానీ ఇప్పుడు సోనూసూద్ దేవుడిలా కనిపిస్తున్నాడు అంటూ తమ్మారెడ్డి భరద్వాజా అన్నారు.

సోనూపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నిర్మాత..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts