పద్మ పురస్కారాలకు నామినేష‌న్ లో సోనూ..?

భార‌త‌దేశంలో ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి ఏటా గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు కేంద్రం ఈ పుర‌స్కారాల‌ను అంద‌జేస్తోంది. క‌ళ‌లు, క‌విత్వం, చ‌దువు, ఆట‌లు, వైద్యం, ఇత‌ర సామాజిక సేవ‌లతో పాటు సైన్స్ లో రాణించిన వారికి అలాగే ఇంజనీరింగ్ తో పాటు పబ్లిక్ అఫైర్స్, సివిల్ లాంటి ప్ర‌ముఖ‌మైన వాటిల్లో సేవ‌లందించిన వారికి ఈ అవార్డుల‌ను అంద‌జేస్తారు.

ఇక ఈ ఏడాది కూడా ప‌ద్మ అవార్డుల కోసం నామినేష‌న్లను స్వీక‌రిస్తోంది. ప్ర‌జ‌ల‌కు తెలిసిన గొప్ప సేవ చేస్తున్న మ‌నుషుల‌ను ప‌ద్మ అవార్డుల‌కు సిఫార్సు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది. సెప్టెంబర్ 15తో నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు చివ‌రి తేదీగా కేంద్రం నిర్ణ‌యించింది.అయితే గొప్ప సేవ‌చేస్తున్న సోనూసూద్ కు ప‌ద్మ పుర‌స్కారం ఇవ్వాల‌ని న‌టుడు బ్ర‌హ్మాజీ కోరారు. ఈ మేర‌కు ట్వీట్ చేశారు. ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని సోనూసూద్‌కు ఇవ్వాల‌ని తాను కోరుకుంటున్న‌ట్టు ట్విట్ట‌ర్ లో రాసుకొచ్చారు.

Share post:

Latest