అదిరిన `సన్నాఫ్ ఇండియా` టీజ‌ర్..రూటే స‌ప‌రేటు అంటోన్న చిరు!

క‌లెక్ష‌న్ కింగ్‌ మోహన్ బాబు ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌తన్ బాబు ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను స్టార్ హీరో సూర్య విడుద‌ల చేశారు.

మన అంచ‌నాల‌కు అంద‌ని వ్య‌క్తిని ఇప్పుడు మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాను.. త‌న రూటే స‌ప‌రేటు అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ తో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో క‌లెక్ష‌న్ కింగ్‌ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తార‌ని టీజ‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

నేను చీకటిలో ఉండే వెలుతురుని.. వెలుతురులో ఉండే చీకటిని అంటూ మోహ‌న్ బాబు చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. ఇక చివ‌ర్లో నేను కసక్ అంటే మీరందరూ ఫసక్ అంటూ మోహ‌న్ బాబు మ‌రో డైలాగ్ కూడా వ‌దిలారు. మొత్తానికి అద్భుతంగా ఆక‌ట్టుకుంటున్న ఈ టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

Share post:

Latest