మ‌హాస‌ముద్రంకు సిద్దార్థ్ భారీ రెమ్యున‌రేష‌న్‌..ఎంతో తెలుసా?

అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం మ‌హాస‌ముద్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

గతంలో ఎన్నడూ చూడని వైవిద్యభరితమైన కథాంశాన్ని తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత సిద్దార్థ్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సిద్దార్థ్ తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

తెలుగులో పూర్తిగా పేడ్ అవుట్ అయిపోయాడు అనుకుంటున్న సిద్ధార్థ్ మ‌హాన‌ముద్రంకు ఏకంగా రూ. 3 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest