రేర్ రికార్డ్ సృష్టించిన బ‌న్నీ స‌తీమ‌ణి..ఖుషీలో అల్లు ఫ్యాన్స్‌!

June 18, 2021 at 7:39 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్నేహా సినిమాలేమి చేయ‌క‌పోయినా.. నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ను పెంచుకుంటూ పోతోంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా స్నేహా ఓ రేర్ రికార్డ్ సొంతం చేసుకుంది. స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవ‌ర్ల సంఖ్య ఏకంగా 4 మిలియ‌న్ల‌కు చేరుకుంది. దీంతో టాలీవుడ్ హీరోల భార్య‌ల‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు ఉన్న ఏకైక వ్య‌క్తి స్నేహ రికార్డు సృష్టించింది.

దీంతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన 3.3 మిలియన్స్‌, మహేష్ బాబు భార్య నమ్రత 2 మిలియన్స్‌ ఫాలోవర్స్‌తో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.

రేర్ రికార్డ్ సృష్టించిన బ‌న్నీ స‌తీమ‌ణి..ఖుషీలో అల్లు ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts