స‌మంత జోరు..మ‌రో వెబ్ సిరీస్‌ను ఒకే చేసిన బ్యూటీ?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్‌-2. ఇటీవ‌లె అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ వెబ్ సిరీస్ సూప‌ర్ టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో సమంత రాజీ పాత్రలో అద‌ర‌గొట్టేసింది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. స‌మంత మ‌రో వెబ్ సిరీస్‌కు ఒకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ స‌మంత‌తో ఓ వెబ్ సిరీస్ చేయాల‌నుకుంటున్న‌ట్లు ప్ర‌స్తుతం ఓ వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ధారిగా తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో నెట్‌ఫ్లిక్స్ ఓ సిరీస్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తుందని, అందులో భాగంగా స‌మంత‌తో సంప్ర‌దింపులు జ‌రప‌గా.. ఆమె గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

Share post:

Popular