వామ్మో..ఫ్యామిలీ మ్యాన్ 2కు సమంత అన్ని కోట్లు పుచ్చుకుందా?

అక్కినేని వారి కోడ‌లు స‌మంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, స‌మంత కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవ‌లె అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది.

- Advertisement -

అయితే ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించింది. ఇందులో రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో స‌మంత ఇర‌గ‌దీసింది. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లోనూ స‌మంత వావ్ అనిపించింది. దీంతో ఆమె న‌ట‌న‌పై ప‌లువురు ప్ర‌ముఖులు, విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు క‌రిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ వెబ్ సిరీస్‌లో న‌టించేందుకు రెమ్యున‌రేష‌న్ కూడా స‌మంత గ‌ట్టిగానే పుచ్చుకుంద‌ట‌.

మామూలుగా ఒక్కో సినిమాకు రెండు కోట్ల వ‌ర‌కు ఛార్జ్ చేసే స‌మంత‌.. ఈ సిరీస్ కోసం ఏకంగా రూ.4 కోట్లు తీసుకుంద‌ట‌. అయితే ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత పాత్ర కీలకం కావ‌డం వ‌ల్ల నిర్మాత‌లు కూడా నాలుగు కోట్లు ఇచ్చేందుకు ఏ మాత్రం వెన‌కాడ‌లేద‌ని తెలుస్తోంది. ఇక మనోజ్‌ రూ.10 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.

Share post:

Popular