రిలీజ్‌కు ముందే ర‌వితేజ మూవీపై క‌న్నేసిన సల్మాన్..త్వ‌ర‌లోనే..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రవితేజ డ్యూయ‌ర్ రోల్ చేస్తుండ‌గా.. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఖిలాడీ ఇంకా విడుద‌ల కాకుండానే.. ఈ సినిమాపై క‌న్నేశాడు బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్‌.

ఇటీవ‌ల విడుద‌లైన ఖిలాడీ టీజ‌ర్‌కు స‌ల్మాన్ బాగా ఇప్రెస్ అయ్యార‌ట‌. దీంతో వెంట‌నే క‌థ తెలుసుకోగా.. అది కూడా బాగా న‌చ్చిందట‌. దీంతో బాలీవుడ్‌లో ఖిలాడీ రీమేక్ చేసేందుకు స‌ల్మాన్ ఫిక్స్ అయ్యార‌ట‌. అంతేకాదు, తెలుగులో తెర‌కెక్కిస్తున్న ర‌మేష్ వ‌ర్మ‌నే హిందీలోనూ తీయ‌నున్నాడ‌ని స‌మాచారం.

Share post:

Latest