ఆర్ఆర్ఆర్‌కి ప్యాక‌ప్ చెప్పేది అప్పుడేన‌ట‌..?!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది.

అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతుండ‌డంతో మ‌ళ్లీ ఆర్ఆర్ఆర్ సెట్స్ మీద‌కు వెళ్లింది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం.. జూలై నెలాఖ‌రుకు షూటింగ్ పూర్తి చేసేసి ప్యాక‌ప్ చెప్పేయ‌నున్నార‌ట‌.

ప్ర‌స్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఓ సాంగ్ షూట్ చేస్తున్నారట‌. మరికొద్ది రోజుల్లో ఆలియా కూడా జాయిన్ కానుందట. జూలై నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది.

Share post:

Latest