ర‌ష్మిక సంచ‌ల‌న నిర్ణ‌యం..క‌రోనా భ‌యంతో అలా..?

చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. అలాగే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక‌.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌క సంబంధించిన విష‌యాల‌ను, ఫొటోల‌ను పంచుకుంటుంది.

అలాగే త‌ర‌చూ త‌న అభిమానుల‌తో ముచ్చ‌ట్లు పెడుతుంటుంది. ఈ క్ర‌మంలోనే నెట్టింట ఈమెకు భారీ ఫాలోంగ్ ఏర్ప‌డింది. అయితే క‌రోనాకు భ‌య‌ప‌డి ఒకానొక సమయంలో సోషల్‌ మీడియా వీడాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంద‌ట ర‌ష్మిక. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక‌ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ఆమె మాట్లాడుతూ..కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అర్థమైంది. అవి ఎంతో బాధను ఇవ్వడం కాక, మానసిక శాంతిని దూరం చేస్తాయి. అందుకే మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాను విడిచిపెట్టాలని అనుకున్న. కానీ అలా చేయలేకపోయాను. ఈ సంక్షోభ సమయంలో సోషల్‌ మీడియా ద్వారా సేవ చేసే వారికి మద్దతుగా, కష్టాల్లో ఉన్న వారికి సాయంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాను విడిచి పెట్ట‌లేదు అంటూ చెప్పుకొచ్చింది.

Share post:

Latest