ప్రముఖ దర్శకుడు మృతి..!

ప్రముఖ తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ (90) కన్నుముశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు (జూన్ 3) ఉదయం 8.45 గంటలకు తుది శ్యాస విడిచారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. చెన్నైలో ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. జీఎన్ రంగరాజన్ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. కాగా రంగరాజన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా మీందమ్ కోకిల, మహారసన్ వంటి పలు చిత్రాలు తెరకెక్కించాడు.

- Advertisement -

ఇక జీఎన్ రంగరాజన్.. కళ్యాణ రామన్, ఎల్లం ఇంబమాయం, కాదల్ మీంగల్, ముత్తు ఎంగల్ సొత్తు, పల్లవి మీందుమ్.. పల్లవి మీందమ్ పల్లవి.. అడుత్తతు ఆల్బర్ట్ వంటి సినిమాలకు రంగరాజన్ దర్శకత్వం వ్యవహరించాడు. ఆయన తనయుడు జీయన్నార్ కుమారవేలన్ కూడా టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కుమారవేలన్ ప్రస్తుతం అరుణ్ విజయ్ హీరోగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.

Share post:

Popular