ప్రేమ‌లో పడ్డ అడివి శేష్.. నిజమెంతటే..?

టాలీవుడ్ యువ న‌టుడు అడివి శేష్ వ్య‌క్తిగ‌త లైఫ్ గురించి వ‌స్తున్న గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చాడు. తాను ప్రేమ‌లో ఉన్న‌ట్టు చెప్పాడు. పాపుల‌ర్ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ..తాను ఒంటరిగా ఏం లేన‌ని..తాను పెండ్లికి అప్పుడే సిద్దంగా లేన‌ని చెప్పాడు. అడివి శేష్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. వ‌రుస సినిమాల‌తో త‌న‌కు నిద్రపోయేందుకు కూడా స‌మ‌యం దొర‌క‌డం లేద‌ని చెప్పాడు. అయితే ఈ కుర్ర హీరో ఎవ‌రితో ప్రేమ‌లో ఉన్న‌ది చెప్ప‌లేదు కానీ త‌న ప్రియురాలు హైద‌రాబాదీ అని మాత్రం చెప్పాడు. త‌న ప్రియురాలి నుంచి అనుమ‌తి తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే వ్య‌క్తిగ‌త జీవితంపై ప‌బ్లిక్ గా ఏం మాట్లాడ‌టం లేద‌ని చెప్పుకొచ్చాడు. ఇటీవ‌లే అడివిశేష్ కు ఓ బాలీవుడ్ న‌టితో లింక‌ప్ రూమ‌ర్స్ తెర‌పైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నటుడు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు.