ప్రభాస్, రాజమౌళిలపై బండ్లన్న కామెంట్స్ వైరల్…!

టాలీవుడ్ బాహుబలి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు జక్కన్న లను బండ్ల గణేశ్ ఆకాశానికెత్తేశాడు. తెలుగు చలన చిత్ర ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేశ్.. మాట్లాడుతూ… జక్కన్నను, ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎన్నికలు ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కేవలం నామ్ కే వాస్తే గా ఎన్నికలు జరుగుతాయని అన్న వారందరూ… మా అధ్యక్ష పీఠం కోసం ప్రస్తుతం నెలకొన్న పోటీని చూసి.. ముక్కున వేలేసుకుంటున్నారు.

కాగా బండ్ల గణేశ్.. జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ… అసలు చిత్రపరిశ్రమలో పరాయి వ్యక్తి అనే భావనే ధరి చేరదని తెలిపారు. మేమంతా ఒక్కటే అని పేర్కొన్నారు. ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేని రాజమౌళి, ప్రభాస్ లను కూడా ఆయన వదలలేదు. జక్కన్నకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని, అలాగే ప్రభాస్ తన మార్క్ నటనతో దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితుడయ్యాడని తెలిపారు.