ఎన్నో అంచనాల నడుమ విడుదలైన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీ రాధే. అయితే అంచనాలకు తగ్గట్టు ఈ మూవీ ఆడలేదు. పూర్తి స్థాయిలో నెగటివ్ టాక్ మూటగట్టుకుంది రాధే. అన్ని రకాల రివ్యూలు మూవీకి వ్యతిరేకంగా రావడం నిరాశ పరిచింది. అయితే ప్రపంచంలో తనను తాను నంబర్ వన్ క్రిటిక్‌గా చెప్పుకునే వ్యక్తి కమల్ ఆర్ ఖాన్. ఆయన తాజాగా ఈ మూవీ విషయంలో సల్మాన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇక దీనిపై సల్మాన్ ఏకంగా ఆయనపై పరువు నష్టం దావా కూడా వేసిన సంగతి తెలిసిందే.
కాగా రీసెంట్గా ఈ మూవీ వల్ల జీ స్టూడియో ఏకంగా రూ.95 కోట్లు నష్టపోయిందన్న వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. ఇక ఇదే విషయాన్ని తాజాగా కేఆర్కే చెబుతూ మరో ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియా రిపోర్టుల కథనం ద్వారా ఈ మధ్య విడుదలైన పెద్ద సినిమా వల్ల జీ స్టూడియో ఏకంగా రూ.95 కోట్లు నష్టపోయిందని తెలిసిందంటూ ట్వీట్ చేశారు. అలాగే ఈ లాస్ క్రెడిట్ మొత్తం వరల్డ్ నంబర్ వన్ క్రిటిక్కే దక్కుతుంది అని ట్వీట్ చేయడం ఇక్కడ గమనార్హం.
According to media reports #Zee is having loss of ₹95Cr for last big released film. All credit goes to The No.1 critic in the world. Love you people!
— KRK (@kamaalrkhan) June 16, 2021