ఏపీ రాజ‌కీయాల్లోకి వంట‌ల‌క్క‌..ఏ పార్టీ అంటే?

కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల‌క్క‌ అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఒకే ఒక్క సీరియల్‌తో ఎనలేని క్రేజ్‌ను అందుకున్న ఈ భామ.. త్వ‌ర‌లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతోంద‌ట‌.

ఈ విష‌యం స్వ‌యంగా వంట‌ల‌క్కే తెలిపింది. తాజాగా త‌న యూట్యూబ్ ఛానెల్‌లో కార్తీక దీపం షూటింగ్ స్పాట్‌లో చేసిన ఓ వీడియో పోస్ట్ చేసింది వంట‌ల‌క్క‌. ఈ వీడియోలో కార్తీకదీపం సీరియల్ నిర్మాతతో వంట‌ల‌క్క మాట్లాడుతూ.. కేరళలో మా పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. మొత్తం ఎరుపుమయం అయింది అని తెలిపింది.

దీంతో నీకు అక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని ప్ర‌శ్నించాడు నిర్మాత. అందుకు `ఎమ్మెల్యేనా.. నాకు పాలిటిక్స్ ఇంట్రస్ట్ లేదు సార్` అంటూ చెప్పుకొచ్చింది వంటలక్క. పోని కేరళ సంగతి వదిలెయ్.. ఏపీలో టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? అని నిర్మాత అడగడంతో.. వెంటనే చేస్తానని వంట‌ల‌క్క తెలిపింది.. మరి ఏ పార్టీలో చేరతావు అని అడిగితే మాత్రం.. అది చేరినప్పుడు చెప్తా అంటూ సమాధానం ఇచ్చింది వంటలక్క. మొత్తానికి ఈ వీడియో మాత్రం వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular