డైరెక్టర్ అవుతానంటున్న `వ‌కీల్ సాబ్` హీరోయిన్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌ల్ల‌విగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. డైరెక్ట‌ర్ అవ్వాల‌నుకుంటుంద‌ట‌.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా.. భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది.

కానీ, వెంటనే మూవీ డైరక్షన్ కోసం ప్రయత్నాలు చేయ‌కుండా..ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తాన‌ని అంటోంది. అందుకోస‌మే ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు డైరెక్షన్ కోర్సు కూడా నేర్చుకోంటోంద‌ట‌.

Share post:

Latest