బాలయ్య పవర్ఫుల్ ప్రాజెక్ట్‌పై మైత్రీ అప్డేట్ అదిరింది!

ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను క్రాక్‌తో హిట్ అందుకున్న గోపీచంద్ మాలినేనితో చేయ‌బోతున్న‌ట్టు ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అంద‌రూ అంద‌రూ భావించిన‌ట్టుగా ఈ ప‌వ‌ర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు క‌న్ఫార్మ్ చేశారు.

నేడు బాల‌య్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ ప్రాజెక్ట్ వివ‌రాల‌ను కూడా తెలియ‌జేస్తూ..ఇంట్రో వీడియోను విడుద‌ల చేశారు. ఈ ఇంట్రోలో సింహం వేటాడేందుకు సిద్ధమవుతోందని చూపిస్తూ బాల‌య్య‌, గోపీచంద్ మాలినేని ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇక ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చ‌నున్నాడు. ఇతర తారాగణం సిబ్బంది వివరాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి. ఇక ప్ర‌స్తుతం ఎన్.బి.కె 107 కు సంబంధించిన ఇంట్రో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Share post:

Popular