ముంబై కి మకాం మార్చిన రష్మిక ..ఎందుకంటే…?

కుర్రకారు గుండె చప్పుడు రష్మిక మందన్నా టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా వెలుగుతున్న విషయం విధితమే. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్లోనూ వెలిగిపోవాలని చూస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. అంతే కాకుండా.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ `గుడ్ బాయ్`లోనూ కీలక పాత్రలో మెరవనుంది. ఇవే కాకుండా మరో రెండు బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసింది. టాలీవుడ్లో అల్లు అర్జున్ సరసన పుష్ప.. మరో యంగ్ హీరో శర్వానంద్ సరసన ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే ముంబైలో ఓ అపార్ట్ మెంట్ ను ఈ బ్యూటీ కొనుగోలు చేసిందని వినికిడి. అంతేకాకుండా రీసెంట్గా ఈ బ్యూటీ తాను కొనుగోలు చేసిన అపార్ట్ మెంట్ లోకి మకాం మార్చిందట. ఈ విషయాన్ని రష్మికే స్వయంగా తన అభిమానుల కోసం తెలిపింది.

ఎట్టకేలకు నా అపార్ట్ మెంట్ లోకి మారిపోయానని, ఇందుకోసం చాలా సామగ్రి కొనాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇది ఎప్పటికీ అంతం కాని ఖర్చని.. రోజంతా దీనికే గడిచిపోయిందని వివరించింది. కొనుగోలులో తన అసిస్టెంట్ సహాయపడిందని తెలిపింది. ఈ భామ ముంబైలో సెటిలై పోవడంతో… భవిష్యత్ లో తెలుగులో నటిస్తుందో.. లేదో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

Share post:

Latest