మలయాళ మెగాస్టార్ అయిన మోహన్ లాల్ తన సినిమాల దూకుడును కొనసాగిస్తున్నారు. ఇదివరకు ఆయన నటించిన దృశ్యం2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించి ప్రస్తుతం భారీ ఎపిక్ పాన్ ఇండియన్ చిత్రం “మరక్కార్”లో నటిస్తున్నారు. అరేబియన్ సముద్రానికి లయన్ గా పిలవబడే మరక్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. మలయాళం మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమాపై మళయాళ ప్రేక్షకులు అయితే ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.
ఇంతకుముందే మరక్కార్ చిత్రాన్ని విడుడల చేయాలని భావించారు చిత్ర దర్శక నిర్మాతలు. కాకపోతే కరోనా వలన పరిస్థితులు పూర్తిగా తారుమారు కావడంతో రిలీజ్ పై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఇకపోతే ఇప్పుడు కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా తెలిపారు. ఆగష్టు 12 కే తమ ఈ భారీ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నామని.. అందుకోసం మీ అందరి ప్రార్ధనలు, సపోర్ట్ తోనే అది సాధ్యం కావాలని కోరుకుంటున్నట్టుగా మెగాస్టార్ మోహన్ లాల్ తన ఎపిక్ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, కళ్యాణి కీలక పాత్ర లలో నటిస్తున్నారు.