ఆహాలో సంద‌డి చేయ‌నున్న‌ `ఎల్కేజీ`..అదిరిన ట్రైల‌ర్!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధ‌మైంది. ప్రముఖ తమిళ నటుడు ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ ఎల్కేజీ. 2019లో త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించింది. కేఆర్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు తెలుగులో ఆహా వేదిక‌గా ఈ చిత్రం సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 25ను ఎల్కేజీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఎల్కేజీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ తెగ ఆక‌ట్టుకుంటోంది. ఈ చిత్రంలో ఆర్జే బాలాజీ ముఖ్యమంత్రి పాత్రలో క‌నిపించ‌నున్నాడు. ప్రస్తుత రాజకీయాలను వ్యంగ్యంగా ప్రశ్నిస్తూ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది.

Share post:

Popular