‘మా’ ఎన్నికల బరిలో జీవితా.. ?

June 23, 2021 at 2:34 pm

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ మా ఎన్నికల‌కు ఎంతో ప్ర‌త్యేకత ఉంది. తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఈ ఎన్నిక‌లు ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వ‌ర‌కు అధ్యక్షపదవి కోసం ఎన్నిక‌ల్లో ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు లాటి వాళ్లు పోటీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ రేసులోకి సీనియర్‌ నటి అయిన జీవితా రాజశేఖర్‌ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు స‌మాచారాం.

మా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆమె రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మా అసోసియేష‌న్ కార్యదర్శిగా కొనసాగుతున్న జీవితా రాజశేఖర్‌ అధ్యక్షబరిలో ఉంటార‌నే వార్తలు తెలుగు ఇండ‌స్ట్రీలో హాట్‌టాపిక్‌గా త‌యార‌య్యాయి. సెప్టెంబర్ నెల‌లో మా ఎక్ష‌న్లు జరుగుతాయ‌ని స‌మాచారం. అంటే ఇంకా మూడు నెలల టైమ్ మాత్ర‌మే ఉంది. దీంతో ప్ర‌స‌త్తుం పరిశ్రమలో మా అసోసియేష‌న్ ఎన్నికలు అనేక ర‌కాలుగా మలుపు తిరుగుతున్నాయి. అయితే మ‌రి ఇంత‌మంది పోటీ చేస్తుండ‌టంతో ఈ ఎన్నిక‌ల కాస్తా ర‌చ్చ రచ్చ అయ్యేలాగే ఉన్నాయి. మ‌రి ఎవ‌రు గెలుస్తారో చూడాలి.

‘మా’ ఎన్నికల బరిలో జీవితా.. ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts