సల్మాన్‌ ఖాన్ బాట‌లోనే సాయి ధ‌ర‌మ్ తేజ్‌..?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తాజా చిత్రం రిపబ్లిక్. దేవకట్టా దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కింది. అయితే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో సాయి తేజ్ స‌ల్మాన్ ఖాన్‌ను ఫాలో అవుతున్నాడ‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సల్మాన్‌ ఖాన్ రాధే సినిమాను జీ సంస్థ దక్కించుకుని.. పే పర్‌ వ్యూ పద్దతిలో విడుద‌ల చేసింది. దీంతో రాధే నెగ‌టివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది.

అయితే ఇప్పుడు రిపబ్లిక్ సినిమా థియేట్రికల్ రైట్స్ నూ జీ సంస్థ కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉంద‌ట‌. అంతేకాదు, ఈ చిత్రాన్ని కూడా పే పర్‌ వ్యూ పద్దతిలో విడుద‌ల చేసేందుకు రెడీ అయిందట‌. ఇక జీ సంస్థ ఇచ్చిన ఆఫ‌ర్‌పై సాయి తేజ్ మ‌రియు నిర్మాత‌లు కూడా ఇంట్ర‌స్ట్ చూపుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.

Share post:

Popular