విజయ్ దేవరకొండను లైన్‌లో పెట్టిన నాని డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఇదిలా ఉంటే.. విజ‌య్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. నాని హీరోగా తెర‌కెక్కిన జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు గౌతమ్ తిన్ననూరి విజ‌య్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

Gowtam Tinnanuri refutes rumours about his next film after the Hindi remake  of Jersey | Telugu Movie News - Times of India

ఇటీవ‌లె విజయ్ దేవరకొండకి గౌత‌మ్ కథ చెప్పాడని.. అది ఆయ‌న‌కు బాగా నచ్చంద‌ట‌. దీంతో గౌత‌మ్ త్వ‌ర‌లోనే విజయ్ కి పూర్తి స్క్రిప్టు వినిపించేందుకు రెడీ అవుతున్నాడట. స్క్రిప్టు కూడా న‌చ్చితే.. వెంట‌నే ఈ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకువెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. కాగా, గౌత‌మ్ తిన్న‌నూరి ప్రస్తుతం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో జెర్సీ హిందీ రీమేక్ తెర‌కెక్కిస్తున్నాడు.

Share post:

Latest