ఫాదర్స్ డే స్పెషల్: తండ్రికి సూపర్ స్టార్ ఇలా…!

ఫాదర్స్ డే సందర్భంగా ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ తండ్రిపై ఉన్న ప్రేమ‌ను సామాజిక మాధ్య‌మాల ద్వారా వ్య‌క్తం చేస్తున్నారు. ఇందులో సామ‌న్యుల నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులూ ఉన్నారు. ఈరోజు సోష‌ల్ మీడియాలో ఎక్కువ పోస్టులు వాటికి సంబంధించిన‌వే ఉన్నాయి. అయితే అన్ని పోస్టుల మ‌ధ్య మ‌హేష్ బాబు పోస్టు కొంత వైర‌ల్‌గా మారింది. తండ్రి కృష్ణ‌, త‌నూ ఉన్న పాత ఫొటోను పోస్టు చేస్తూ తండ్రికి ఫాద‌ర్స్ డే విషేష్ చెప్పాడు. నాన్న నా హీరో, నా బ‌లం, నా ప్రేర‌ణ నువ్వే అని త‌న‌లోని భావాల‌ను వ్య‌క్తం చేశారు మ‌హేష్ బాబు. బ‌య‌ట ఎంత పెద్ద సెల‌బ్రేటి అయినా ఒక తండ్రికి కొడుకే అని, వాళ్ల మ‌ధ్య ఎంతో అనుబంధం ఉంద‌ని ఈ పోస్టు ద్వారా తెలుస్తోంది. అయితే మ‌హేష్ బాబు పోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సూప‌ర్ స్టార్ న‌ట వార‌స‌త్వాన్ని పునికి పుచ్చుకున్న మహేష్ బాబు.. న‌ట‌న‌లో త‌నదైన ముద్ర వేసుకున్నారు. బాల న‌టుడిగా తెలుగు సినిమా రంగానికి మ‌హేష్ బాబు.. అటు మాస్ హీరోగాను, ఇటు క్లాస్ హీరోగానూ పేరు తెచ్చుకున్నారు.

- Advertisement -

Share post:

Popular