మంచు వారబ్బాయితో `జాతిరత్నాలు` భామ రొమాన్స్‌?

ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాదీ భామ..జాతిరత్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను క‌ట్టిప‌డేసిన ఫ‌రియాకు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్ర‌మంలోనే మంచు వార‌బ్బాయి మంచు విష్ణుతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఫ‌రియా ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం మంచు విష్ణ శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఢీ మూవీ సీక్వల్‌గా ఢీ అండ్ ఢీ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఫ‌రియాను ఎంపిక చేశార‌ట‌. ఇందులో భాగంగానే చిట్టిని సంప్ర‌దించ‌గా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌టన రావాల్సిందే.

Share post:

Latest