శేఖ‌ర్ క‌మ్ముల మూవీకి ధ‌నుష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ధనుష్ తెలుగులో నటించనున్న తొలి చిత్రం ఇది. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా తెర‌కెక్కుతోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా చిత్రానికి ధ‌నుష్ పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వర్గాల్లో హాట టాపిక్ గా మారింది.

ఈ చిత్రానికి గానూ ధునుష్ ఏకంగా రూ.50 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. మరి ఇందులో ఎంత మేర నిజముందో కానీ, నెట్టింట మాత్రం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

Share post:

Latest