నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..అమిత్ షాతో భేటీ అందుకేన‌ట‌?!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు.

- Advertisement -

రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఆదుకోవాలని కూడా కోర‌నున్నార‌ట‌.

అయితే తన బెయిలు రద్దు పిటిషన్‌పై ఈనెల 14న విచారణ జరగనుండటం, ఎంపీ రఘురామరాజు అరెస్టు, సీఐడీ కస్టడీలో ఆయన్ని చిత్రహింసలు పెట్టిన ఘటనలపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Share post:

Popular