టీకా డోస్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీన్ని క‌ట్ట‌డి చేయాలంటే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం. ఇందుకు కేంద్రం కూడా ఇప్ప‌టికే భారీ ఎత్తున వ్యాక్సినేష‌న్‌కు ప్ర‌ణాళిక వేస్తోంది. అయితే దీనికి కొత్త‌గా కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా మొద‌టి డోస్ వేసుకున్న త‌ర్వాత రెండో డోసు 84రోజుల త‌ర్వాత తీసుకోవాలి.

అయితే ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విదేశాల్లో చ‌దువుకునే వారికోసం ఈ మార్గ‌ద‌ర్శ‌కాల్లో మార్పులు చేసింది. విదేశాల్లో ఉద్యోగాలు, చ‌దువు కోసం వెళ్లే వారు మొద‌టి డోసు తీసుకున్న త‌ర్వాత 28 రోజుల‌కే రెండో డోసు తీసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఇందులో వారికి మిన‌హాయింపు ఇచ్చింది. కాగామిగ‌తా వారికి కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కార‌మే వ్యాక్సిన్ వేస్తున్నారు. దీంతో విదేశాల్లో చ‌దువుకునే వారికి లాభం చేకూర‌నుంది. క‌రోనా క‌ట్ట‌డికి ఏపీ ప్ర‌భుత్వం అన్ని రకాల చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త ఏర్పాట్లు చేస్తోంది.

Share post:

Latest