`రాధేశ్యామ్`ను భారీ రేటుకు ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒక‌టి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ బ‌డ్జెట్‌తో రాధేశ్యామ్ తెర‌కెక్కుతోంది.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రం డిజిట‌ల్ హ‌క్కుల‌కు ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఎవ‌రూ ఊహించ‌ని భారీ రేటుకు ద‌క్కించుకుంద‌ట‌.

అందుతున్న సమాచారం మేరకు ఓటీటి జెయింట్స్ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ రెండూ ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడ‌గా.. చివ‌ర‌కు 400 కోట్ల డీల్‌తో అమెజాన్ రాధేశ్యామ్ డిజిట‌ల్ రైట్స్‌ను సొంతం చేసుకుని టాక్ వినిపిస్తోంది. కాగా, సినిమా విష‌యానికి వ‌స్తే.. వారం ప‌ది రోజుల మిన‌హా ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ కూడా పూర్త‌య్యాయి. లాక్‌డౌన్ ఎఫెక్ట్ ఎప్పుడు ముగిసినా షూటింగ్ స్టార్ట్ చేసి పెండింగ్ పార్ట్‌ను పూర్తి చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Share post:

Latest