బాలీవుడ్‌కు అల్ల‌రి న‌రేష్ `నాంది`..హీరో ఎవ‌రో తెలుసా?

అల్ల‌రి న‌రేష్ హీరోగా విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం నాంది. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర పోషించింది. తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ జీవిత నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌న్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన హిందీ ,తమిళ ,కన్నడ, మలయాళ రీమేక్ రైట్స్ ను కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నారు.

Dil Raju Announces Naandhi Bollywood Remake

ఇక ఈ రీమేక్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించ‌బోతున్నాడు. దీనిపై నేడు అధికారిక ప్రకటన రావడం జరిగింది. అజయ్ దేవ్ గణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ మూవీ నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Share post:

Latest