`ఆర్ఆర్ఆర్` లో అజయ్ దేవగణ్ రోల్ లీక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో క‌ల్పిత‌ కథతో రూపుదిద్దుకుంటున్న‌ చిత్రమిది.

ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య అజ‌య్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా.. సూప‌ర్ రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. అయితే ఇప్పుడు అజ‌య్ రోల్ గురించి ఓ లీక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి తాజాగా అజయ్ దేవ్ గణ్ తో దిగిన ఫోటో పంచుకున్నారు. అంతేకాదు, అజయ్ దేవ్ గణ్ ఆర్ఆర్ఆర్‌ మూవీలో తన తండ్రి పాత్ర చేస్తున్న‌ట్టు రివిల్ చేశాడు. అంటే అజయ్ దేవ్‌గణ్ ఎన్టీఆర్ తండ్రి పాత్ర చేస్తున్నార‌ని స్ప‌ష్టం అర్థమైంది. ఇక ఈ న్యూస్ లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Share post:

Latest