ఈసారి సూపర్ హీరో కథతో వ‌స్తున్న ప్రశాంత్ వర్మ!

అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి.. త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న నాల్గొవ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించాడు.

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం హను-మాన్. `ఈ సారి నాకు ఇష్టమైన జోనర్‌తో వస్తున్నాను. క్రొత్త సినిమాటిక్ విశ్వంలోకి ప్రవేశించడానికి మీ సీట్ బెల్టులను కట్టుకోండి. హనుమాన్.. తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా` అంటూ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌శాంత్ ప్ర‌క‌టించాడు.

ఈ మేర‌కు ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండ‌గా.. హీరో సహా ప్రాజెక్ట్ తారాగణం ఇతర సిబ్బంది వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.

Share post:

Latest