ఆ సినిమా చేయకపోవడనికి కారణం తెలిపిన విశ్వక్​సేన్..!?

హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్​ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్​ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్​సేన్. పాగల్ షూటింగ్​ టైములో హిట్​ 2 కు డేట్లు కేటాయించ లేకపోవటం వల్లే ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆలీ షోలో చెప్పాడు విశ్వక్.

వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాడు యువ హీరో విశ్వక్‌సేన్‌. ఫలక్‌నుమా దాస్‌ మూవీతో ప్రేక్షకులకి మరింత దగ్గర అయ్యాడు విశ్వక్​సేన్. ఆ తరువాత యాక్షన్‌ థ్రిల్లర్‌ హిట్‌: ది ఫస్ట్ కేస్‌ మూవీలో విక్రమ్‌ రుద్రరాజుగా బాగా అలరించాడు. ఇలా వరుస చిత్రాలతో అలరిస్తున్న విశ్వక్‌ ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన మూవీ కబుర్లను పంచుకున్నారు విశ్వక్​సేన్​..

Share post:

Latest