ఓటీటీలో `పాగ‌ల్‌`..క్లారిటీ ఇచ్చేసిన విష్వక్ సేన్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విశ్వక్‌సేన్ తాజా చిత్రం పాగ‌ల్‌. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‏గా నటిస్తుంది. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1న విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ చిత్రం థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే ఛాన్స్ లేదు. దీంతో ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌నూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

రోజురోజుకూ ఈ ప్రచారం ఎక్కువవుతూ ఉండటంతో.. తాజాగా విష్వ‌క్ ఓ క్లారిటీ ఇచ్చాడు. పాగల్ ఓటీటీకి వెళుతుందనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదనీ.. ఈ సినిమా థియేటర్లకే వస్తుందని ఆయ‌న స్పష్టం చేశాడు.

Share post:

Latest