వైరల్ : చెరువులో నీటిని తాగుతున్న చిరుత.. అంతలోనే మొసలి..?!

అడవిలో, లేదా మ‌న చుట్టు ప‌క్క‌ల ప్ర‌కృతిలోజ‌రిగి వింత‌లు, విశేషాలు కండ్ల‌కు కనువిందు చేస్తాయి. అలాంటివి చూడాలంటే నిజంగా ఒక అద్భుత‌మే అని చెప్పాలి. ఎందుకంటే అవి స‌హ‌జంగా జ‌రిగేవి. కాబ‌ట్టి వాటికి అంత ప్రియారిటీ ఇస్తుంటారు ప్ర‌జ‌లు. ఇప్పుడు కూడా అలాంటి ఓ విశేష ఘ‌ట‌న జ‌రిగింది. నిజంగా ప‌రీక్షించి చూస్తే గానీ అందులో ఏం జ‌రిగిందో తెలియ‌దు.

అడవి జంతువుల జీవితం నిత్యం జీవన్మరణ పోరాటమే అని చెప్పాలి. అడవిలోని కొన్ని జంతువులు పండ్లు, చెట్లను, గ‌డ్డి తిని జీవిస్తే.. మరికొన్ని క్రూర మృగాలు జంతువులనే తిని జీవిస్తాయి. అలా నిత్యం ఎదురయ్యే ప్రమాదాలను దాటుకుంటూ ప్రతీ జంతువు జీవిత పోరాటం చేయాల్సిందే. ఇదంతా ప్ర‌కృతి స‌హ‌జ సిద్ధ‌మైన విష‌యం.

ఇప్పుడు చిరుత పులికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో కొద్ది గంట‌ల్లోనే ల‌క్ష‌ల వ్యూస్ సొంతం చేసుకుంది. వంద‌ల కామెంట్లు వ‌స్తున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో ఎముందో ఇప్పుడు తెలుసుకుదాం.

ఆ వీడియో క్లిప్‌లో దాహంతో ఉన్న ఓ చిరుత పులి నీరు తాగేందుకు.. గడ్డి మొక్కలతో నిండి ఉన్న ఒక కాలువ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. అయితే అది భయపడుతూనే అడుగులు ముందుకు వేసిన చిరుత.. అదే భయంతో బిక్కు బిక్కుమంటూ కొద్ది కొద్దిగా నీళ్ల‌ను తాగుతూ ఉంటుంది. చిరుత రాకను గమనించి నీటి అడుగులో మాటు వేసిన మొసలి.. అదును చూసి చిరుతపై అటాక్ చేసింది. కానీ చిరుత ఒక్క ఉదుటున పైకి ఎగురుతుంది. మొసలికి దొర‌కుండా ఒక్క ఉదుటన ప‌రుగు పెడుతుంది. 14 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోకు సెకన్ల వ్యవధిలోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి.