విజయ్ ” లైగ‌ర్ ” టీజ‌ర్ వాయిదా..?

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు..విజయ్ దేవరకొండ. చాలా మంది విజయ్ కు ఫ్యాన్స్ అయిపోయారు. అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త రకం ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న లైగర్ సినిమా టీజర్ విడుదల కానుంది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్ విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ప్ర‌స్తుతం కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో దేశం కకావికలంగా ఉంది. ఈ ప‌రిస్థితులలో మూవీ టీజ‌ర్‌ను వాయిదా వేస్తున్న‌ట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా తెలిపింది.

మే 9న లైగ‌ర్ ప‌వర్ ప్యాక్ట్ టీజ‌ర్ రిలీజ్ చేద్దామ‌నుకున్నారు. అయితే కరోనా సంక్షోభ స‌మ‌యంలో టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం క‌న్నా, వాయిదా వేయ‌డ‌మే మంచిద‌నిపించిందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌తంలో ఎన్న‌డు క‌నిపించ‌ని లుక్‌లో మెరవ‌నున్నట్లు తెలిపారు. గతంలోని సినిమా పాత్రలో పోలిస్తే లైగర్ సినిమాలోని విజయ్ దేవరకొండ పాత్ర భిన్నంగా ఉంటుందని, అభిమానులు తప్పక ఆదరిస్తారని సినీ దర్శకుడు పూరి జగన్నాధ్ తెలిపాడు.

Share post:

Latest