ఆ హీరోయిన్‌కు విజయ్ దేవ‌ర‌కొండ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్..వీడియో వైర‌ల్‌!

ఛార్మీ కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నీతోడు కావాలి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఛార్మీ..త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల స‌ర‌స‌న ఆడిపాడింది. అయితే ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్న ఈ అమ్మ‌డు.. చిత్రసీమలోనే నిర్మాతగా దూసుకుపోతోంది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. నిన్న(మే 17) ఛార్మీ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, అభిమానుల నుంచి ఆమెకు బ‌ర్త్‌డే విషెస్ వెల్లు వెత్తాయి. అయితే రౌడి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ నుండి విషెస్ మాత్ర‌మే కాదు ఓ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఛార్మి ద‌గ్గ‌ర‌కు వెళ్లింది.

ఆ గిఫ్ట్ చూసి తెగ మురిసిపోయిన ఛార్మి.. అందుకు సంబంధించిన వీడియోని త‌న ఇన్‌స్టాగ్రాములో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూస్తుంటే.. ఛార్మీకి విజ‌య్ ఏదో కాస్ట్లీ గిఫ్ట్ పంపిన‌ట్టే అర్థం అవుతోంది. కాగా, పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్నా విజ‌య్‌. ఈ చిత్రాన్ని పూరీతో క‌లిసి ఛార్మీనే నిర్మిస్తోంది.

Share post:

Popular