వైర‌ల్ వీడియో: వ‌రుణ్ తేజ్‌కు ఈ ట్యాలెంట్ కూడా ఉందా..?

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ వ‌రుస‌ విజ‌యాల‌ను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు.

అలాగే అనిల్ రావిపూడి ద్శ‌క‌త్వంలో ఎఫ్ 3 చిత్రం చేస్తున్నారు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ దృష్ట్యా.. ఈ చిత్రాల షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. ఇక ప్ర‌స్తుతం ఇంట్లో ఉంటున్న వ‌రుణ్‌.. తాజాగా త‌న‌లో ఉండే కొత్త ట్యాలెంట్‌ను బ‌య‌ట పెట్టాడు.

వరుణ్ తాజాగా ఇన్ స్టాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో తన ముక్కుపై కొన్ని సెకన్ల పాటు ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ ను గిర్ర‌న తిప్పుతూ చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది లాక్ డౌన్ ఎఫెక్ట్ అని కామెంట్ చేయ‌డం గమనార్హం.

https://www.instagram.com/p/CPdVIcJDSIG/?utm_source=ig_web_copy_link